ఆలస్యమైనా..న్యాయం గెలిచింది..!
close
Published : 20/03/2020 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలస్యమైనా..న్యాయం గెలిచింది..!

నిర్భయ దోషుల శిక్షపై సెలబ్రిటీల స్పందన

ముంబయి: ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ దోషులకు శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఉరిశిక్ష అమలు చేశారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయస్థానం వాటంన్నిటి తోసి పుచ్చింది. ఏడు సంవత్సరాలు నిరీక్షించినప్పటికీ నిర్భయకు సరైన న్యాయం జరిగిందంటూ పలువురు సినీతారలు సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టారు. అంతేకాకుండా మహిళలపై వేధింపులకు పాల్పడితే శిక్షలు తప్పవనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

‘నిర్భయకు నాయ్యం జరిగింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఇది ఒక ఉదాహరణగా మారాలి. అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలి. మహిళలను ప్రతిఒక్కరూ గౌరవించాలి. ఉరిశిక్షను ఇన్నేళ్లపాటు ఆలస్యం చేసినవారు సిగ్గుపడాలి. జై హింద్‌..!!’ - రిషి కపూర్‌

‘ఆలస్యమైనా నిర్భయకు న్యాయం జరిగింది.  ఎంతోకాలం ఎదురుచూపుల తర్వాత సరైన న్యాయం జరిగింది. కఠినమైన శిక్షల అమలు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుతో త్వరితగతిన న్యాయం జరిగేలా చేయడంతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవారు భయపడాలి.’ - రితేశ్‌ దేశ్‌ముఖ్‌

‘చివరికి నిర్భయకు న్యాయం జరిగింది. ఆమె తల్లిదండ్రులకు మానసిక శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ - మధుర్‌ భండార్కర్‌

‘నిర్భయ కేసు ముగిసింది. ఈ ఉరిశిక్ష ఎప్పుడో అమలు కావాల్సింది. ఇప్పటికైనా దోషులకు శిక్ష పడినందుకు సంతోషిస్తున్నాను.’ - ప్రీతి జింటా

‘ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నేడు నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడింది. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు రాత్రి నిర్భయ తల్లిదండ్రులు కొంచెం ప్రశాంతంగా నిద్రిస్తారని నేను భావిస్తున్నాను.’ - తాప్సీ

‘నిర్భయదోషులకు ఉరిశిక్ష అమలుచేశారనే ఓ గొప్ప వార్తతో ఈరోజు నా జీవితం ప్రారంభమైంది. న్యాయం గెలిచింది’ - తమన్నా


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని