‘సి’ విటమిన్‌ను ఎక్కువగా తీసుకోండి
close
Published : 20/03/2020 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సి’ విటమిన్‌ను ఎక్కువగా తీసుకోండి

కరోనాపై సెల్రబిటీల స్పందన

హైదరాబాద్‌: ‘సి’ విటమిన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో రోగ నిరోధకశక్తి మెరుగవుతుందని.. కరోనా వైరస్‌ కట్టడికి అది చాలా ముఖ్యమని నటి మంచు లక్ష్మి అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న తరుణంలో పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంచులక్ష్మి, అక్షయ్‌కుమార్‌, త్రిష కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సోషల్‌మీడియా వేదికగా పలు వీడియోలను షేర్‌ చేశారు.

‘కరోనా వైరస్‌ గురించి భయపడడం మానండి. జాగ్రత్తలు పాటించండి.

1.చేతులను శుభ్రం చేసుకోండి.. చేతులను శుభ్రం చేసుకోండి.. చేతులను శుభ్రం చేసుకోండి.. చేతులను శుభ్రం చేసుకోండి.. చేతులను శుభ్రం చేసుకోండి.. ఇన్నిసార్లు ఎందుకు చెప్పానంటే.. అది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పటికప్పుడూ చేతులను శుభ్రం చేసుకోండి.

2.తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒకవేళ తుమ్ములు వస్తే అరచేతుల్లో కాకుండా మోచేయి అడ్డుపెట్టుకుని తుమ్మండి.

3.మాస్క్‌లను ధరించండి.

4.శానిటైజర్లను ఉపయోగించండి (ఆల్కహాల్‌ ఉండేవి).

5.మీరు కనుక ఆరోగ్యంగా ఉన్నట్లు అయితే విటమిన్‌ ‘సి’ ఎక్కువగా తీసుకోండి. ఆరెంజ్‌ జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోండి. విటమిన్‌  ‘సి’కి సంబంధించిన మందులు కూడా దొరుకుతాయి. ఒక టాబ్లెట్‌ను నీటిలో వేసుకుని తాగండి.

అలా చేయడం వల్ల మీలోని రోగ నిరోధక శక్తి పెరుగుతోంది. బలహీనంగా, జలుబు, దగ్గులు తరచూ వచ్చేవారికి కరోనా త్వరగా వచ్చే అవకాశం ఉందని విన్నాం. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాం.’ అని మంచులక్ష్మి పేర్కొన్నారు.

మరోవైపు త్రిష సైతం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముఖ్యమైన ఐదు జాగ్రత్తల గురించి తెలిపారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించమని ఆమె తెలిపారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ సైతం ట్విటర్‌ వేదికగా ఓ వీడియో షేర్‌ చేశారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. స్వీయ సంయమనం పాటించాలని ఆయన కోరారు. కరోనా నివారణకు ప్రస్తుతానికి ఉన్న మార్గం అదొక్కటే అని అక్షయ్‌ తెలిపారు. 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని