పొలాచ్చి కేసు విచారణ.. హీరో కార్తి అసంతృప్తి
close
Published : 20/03/2020 23:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొలాచ్చి కేసు విచారణ.. హీరో కార్తి అసంతృప్తి

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దోషులను ఎట్టకేలకు శుక్రవారం ఉదయం ఉరితీశారు. ఈ తీర్పుపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం జరిగిందని అనేక మంది ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఇదే సందర్భంగా తమిళ కథానాయకుడు కార్తి కూడా స్పందించారు. పొలాచ్చి కేసులో బాధితులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. ‘దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నిర్భయకు న్యాయం జరిగింది. పొలాచ్చి కేసులో న్యాయం జరగడానికి ఇంకెంత సమయం పడుతుందో అని ఆశ్చర్యపోతున్నా. ఇప్పటికే ఏడాది పూర్తయింది. ఆ ఘటన నుంచి నేర్చుకున్న పాఠాన్ని ఎవరూ మర్చిపోకూడదు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి’ అని కార్తి ట్వీట్‌ చేశారు.

గత ఏడాది ఫిబ్రవరి 12న తమిళనాడు పొలాచ్చిలో కళాశాల విద్యార్థిని(19)కి పరిచయస్తులైన శబరిరాజన్‌, తిరునవక్కరుసు.. సతీష్‌, వసంతకుమార్‌ అనే మరో ఇద్దరితో కలిసి కారులో వివస్త్రను చేసి, సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. తాము పిలిచినప్పుడు వచ్చి కోరిక తీర్చాలని, పోలీసులకు చెబితే వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఇలానే అనేక మంది అమ్మాయిలను బెదిరించి, అఘాయిత్యాలకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఆపై కేసు అనేక మలుపులు తిరిగింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని