వైద్యులను హర్షించాల్సిన సమయమిది
close
Updated : 21/03/2020 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్యులను హర్షించాల్సిన సమయమిది

ప్రధాని పిలుపుపై చిరు, మహేశ్‌ స్పందన

హైదరాబాద్‌: దేశంలో నానాటికి కరోనా కల్లోలం పెరిగిపోతోంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం దేశంలోని ప్రజలకు రక్షించేందుకు ఎంతో కష్టపడి పని చేస్తోన్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర రంగాల వారికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీల తాము జనతాకర్ఫ్యూకు సపోర్ట్‌ చేస్తున్నామని తెలిపారు. వైద్యులను హర్షించాల్సిన సమయమిదని.. కాబట్టి దేశంలోని ప్రజలందరూ కూడా జనతా కర్ఫ్యూని బాధ్యతతో పాటించాలని వారు కోరారు.

‘అందరికీ నమస్కారం.. ఈ కరోనా వైరస్‌ను నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో అహర్నిశలు సేవాభావంతో పనిచేస్తోన్న వైద్యులు, నర్సులకు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులు, పోలీస్‌శాఖ వారికి, అలాగే ఆయా ప్రభుత్వాలకు హర్షాతిరేఖలు ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయమిది. దేశ ప్రధాని పిలుపుకు స్పందిస్తూ..ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మనమందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిద్దాం. ఇళ్లకే పరిమితమవుదాం.  మనకోసం సేవలందిస్తోన్న వారికి సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు మన ఇంటి గుమ్మాల్లోకి వచ్చి కరతాళధ్వనులతో ధన్యవాదాలు తెలపాల్సిన సమయమిది. అది మన ధర్మం. భారతీయులుగా మనమందరం ఐక్యమత్యంతో ఒకటిగా నిలబడి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. జైహింద్‌’ - చిరంజీవి

‘ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని రక్షించడానికి తమని తాము పణంగా పెట్టిన ఎన్నో ధైర్య హృదయాలకు నమస్కరిద్దాం. ప్రధాని పిలుపు మేరకు మార్చి22న ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఇళ్లకే పరిమితమవుదాం. అలాగే ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు బాల్కనీల్లోకి వచ్చి కరతాళధ్వనులతో వారికి సంఘీభావం తెలుపుదాం. కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం దేశంలోని ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని కోరుతున్నాను.’ - మహేశ్‌ బాబు

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని