వారికి సోదరీమణులు, పిల్లలు ఉండరా?: అనుష్క
close
Published : 21/03/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారికి సోదరీమణులు, పిల్లలు ఉండరా?: అనుష్క

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని అగ్ర కథానాయిక అనుష్క శెట్టి అన్నారు. కానీ, తనకు ఎప్పుడూ ఆ అనుభవం ఎదురుకాలేదని ఆమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. స్వీటీ నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించాయి. అంజలి, షాలినీ పాండే, మాధవన్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

దీని ప్రచారంలో భాగంగా అనుష్క మీడియాతో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రశ్నించగా.. ‘ఇక్కడ క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని నేను చెప్పను. కానీ అదృష్టవశాత్తూ నాకెప్పుడూ అలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. ఎందుకంటే నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంటా. ఎవరైనా సరే.. ఓ మహిళ నుంచి ఇలాంటి ప్రతిఫలం ఆశించడం తప్పు. నాకు తెలిసి ఇది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం. చిత్ర పరిశ్రమలో అతి సులభంగా రాణించాలా?, కష్టపడి నిలదొక్కుకోవాలా?.. ఇలాంటి విషయాల్ని మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మహిళ నో చెబుతుందో.. అప్పుడే పురుషుడు మహిళల్ని గౌరవించడం ప్రారంభిస్తాడు’ అని చెప్పారు.

అనుష్క ప్రేమ, వివాహం గురించి ఇప్పటికే అనేక వదంతులు వచ్చాయి. వీటిపై ఆమె స్పందిస్తూ.. ‘వదంతులనేవి చిత్ర పరిశ్రమలో సాధారణం. ఈ విషయంలో నేనేం చేయలేను. కానీ నాపై అలాంటి వార్తలు ఎందుకు రాస్తుంటారో నాకు అర్థం కాదు. నాపై వదంతులు రాసిన వారికి సోదరీమణులు, పిల్లలు ఉండరా.. అని ఆశ్చర్యపోతుంటా’ అని చెప్పారు. టీవీ చూడటం, పత్రికలు చదవడం తనకు అలవాటు లేదని.. స్నేహితులు పంపించిన మెసేజ్‌ల ద్వారా తనపై వచ్చిన పుకార్ల గురించి తెలుసుకుంటుంటానని ఆమె పేర్కొన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని