స్వీయ నిర్బంధంలో తారలు.. ఏం చేస్తున్నారంటే!
close
Published : 21/03/2020 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వీయ నిర్బంధంలో తారలు.. ఏం చేస్తున్నారంటే!

సోషల్‌మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసిన సెలబ్రిటీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో దాని బారినపడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని, జన సమూహలకు దూరంగా ఉండాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు సినిమా షూటింగ్స్‌ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయాయి. దీంతో టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన చాలామంది సెలబ్రిటీలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరి అలా వెళ్లిన తారలు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో చూడండి..! 

‘స్వీయ సంయమనం అనేది అన్నివిధాలుగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది’ - అనుష్క శర్మ

‘కేవలం కాళ్లను తాకడం యోగా కాదు. ఎప్పుడూ ఒదిగి ఎలా ఉండాలో తెలిపే మార్గం’ ఓ ప్రముఖ రచయిత చెప్పిన ఈ మంచిమాట నాకు ఎంతగానో నప్పుతుంది. నా ఉద్యానవనంలో యోగా చేస్తున్నా’ - తమన్నా

‘ఇంట్లో ఉండి ఓ పుస్తకాన్ని చదవడం పూర్తి చేశా’ - ఆలియా భట్‌

‘నాకెంతో ఇష్టమైన పుస్తకాన్ని స్వీయ నిర్బంధంలో ఉండడం వల్ల మరోసారి పూర్తి చదివాను’ - కాజల్‌

‘10వ రోజు ఇంట్లోనే గడపడం.. పరిస్థితి చక్కబడిన తర్వాత బయటకు వస్తాను. మీరు కూడా ఇంట్లోనే ఉండండి. పెద్ద వాళ్లను, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమను పంచండి. సంతోషంగా జీవించండి’ - శ్రియ

‘కుక్కలు, పిల్లులు నుంచి కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అసత్య ప్రచారాల వల్ల చాలామంది తాము ఎంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులను వదిలిపెట్టేస్తున్నారు.’ - ట్వింకిల్‌ ఖన్నా

‘హాయ్‌ ఆల్‌.. స్వీయ సంయమనం పాటించాల్సిన సమయమిది. మీరందరూ ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉన్నారని భావిస్తున్నాం. మేము కూడా అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా ఉన్నాం.’ - నిక్‌ జొనాస్‌

వీరితోపాటు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా స్వీయ సంయమనంలో సరదాగా సేద తీరుతున్నారు. పక్క పక్క ఇళ్లలో నివసించే అనుపమ్‌ఖేర్‌, అనిల్‌ కపూర్‌ వీడియో కాల్‌ చేసుకుని మాట్లాడుకున్నారు. అలాగే మంచులక్ష్మి, రకుల్ కూడా వీడియో కాల్‌లో సంభాషించుకున్నారు. రణ్‌వీర్‌ విశ్రాంతి తీసుకోగా.. మలైకా ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేస్తున్నారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని