కష్టాల్లో కళాకారులు..సూర్య రూ.10 లక్షల విరాళం
close
Published : 23/03/2020 21:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కష్టాల్లో కళాకారులు..సూర్య రూ.10 లక్షల విరాళం

చెన్నై: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజు పనిచేస్తే కానీ ఇల్లు గడవని కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) సంఘానికి చెందిన 25,000 మంది కళాకారులు ఎటువంటి పనిలేకుండా సమస్యలుపడుతున్నారు. తన సంఘానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశాడని, కుటుంబ సభ్యులకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నానంటూ బాధపడ్డారని ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మీడియాతో అన్నారు. అంతేకాదు తమ సంఘానికి చెందిన దాదాపు 15,000 మంది తమ కుటుంబ సభ్యుల ప్రాథమిక అవసరాలు తీర్చలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వారిని ఆదుకోవాలని కోరారు.

ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ ప్రముఖులు సూర్య, కార్తి, వారి తండ్రి శివకుమార్‌ రూ.10 లక్షలు ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐకు విరాళంగా ఇచ్చారు. ఇలా వచ్చిన విరాళాలతో తమ సభ్యులకు బియ్యం బస్తాలు కొనిస్తామని సెల్వమణి చెప్పారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో సూర్య కుటుంబ సభ్యులు ఇతరులకు సాయం చేశారు. అగరం ఫౌండేషన్‌ను స్థాపించి అనేక మంది పేద చిన్నారులు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పడుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని