అభిమానులకు చిరంజీవి ఉగాది ట్రీట్‌
close
Updated : 24/03/2020 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానులకు చిరంజీవి ఉగాది ట్రీట్‌

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు ఉగాది ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆయన బుధవారం నుంచి ఈ మాధ్యమంలోనూ సందడి చేయబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపింది. ‘ఈ ఉగాది ఎంతో ప్రత్యేకం కాబోతోంది. మీ మెగాస్టార్‌ చిరంజీవి తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. ఆయన్ను ఫాలో కావడానికి సిద్ధంగా ఉండండి’ అని పోస్ట్‌ చేసింది.

‘ఇక నుంచి నేను కూడా సోషల్‌మీడియాలోకి రావాలి అనుకుంటున్నా. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాల్ని అభిమానులతో పంచుకోవాలి అనుకోవడమే. నేను చెప్పాలి అనుకుంటున్న సందేశాల్ని ప్రజలతో చెప్పడానికి ఇది వేదికగా భావిస్తున్నా’ అని ఈ సందర్భంగా చిరు అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చిరంజీవి కొణిదెల’ పేరుతో ఖాతా కనపడుతోంది. దీన్ని అప్పుడే 2.8 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

‘సైరా’ తర్వాత చిరు... కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని