త్వరలోనే తీపి రుచి చూస్తాం
close
Published : 25/03/2020 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలోనే తీపి రుచి చూస్తాం

ఇంట్లోనే ఉండండి అంటోన్న సెలబ్రిటీలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం మనం చేదును రుచి చూస్తున్నాం.. కానీ త్వరలోనే తీపిని రుచి చూస్తాం అని అంటున్నారు పలువురు సెలబ్రిటీలు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండి శార్వరి నామ సంవత్సరాదిని కుటుంబసభ్యులతో సరదాగా జరుపుకోవాలని కోరారు.

‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకి గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలో తీపి, చేదు రెండు ఉంటాయనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న కరోనా సమస్య మనకి చేదును రుచి చూపిస్తుంది. జీవితంలో ఇది ఒక భాగం. త్వరలోనే తీపి రుచి చూస్తాం. ఆరోజులు మళ్లీ రావాలంటే అందరూ తప్పకుండా ఇంట్లోనే ఉండండి. అత్యవసరానికి తప్ప బయటకు రాకండి. ఈ సంవత్సరం ఉగాది ఇంట్లోనే ఆనందం, ఆరోగ్యంగా జరుపుకోండి’ - సుధీర్‌ బాబు

‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కరోనా కల్లోలం త్వరగా తొలగిపోవాలని దేవుడిని ప్రార్థిద్దాం. మీ కుటుంబం, స్నేహితుల గురించి ఆలోచించి బయటకు రాకండి. లవ్‌ యూ ఆల్‌. శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ - అడివి శేష్‌

‘ప్రకృతిని కాపాడుకోండి, పెద్దల మాటను గౌరవించండి. మీ ఇంటిల్లిపాదికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఆ షిర్డీ సాయినాథుడిని  కోరుకుంటున్నాను.’ - మోహన్‌ బాబు

‘మీకు మీ కుటుంబ సభ్యులకు శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. ఇది అసాధారణ కాలం. సంకల్పం, సహనం, పరిపక్వతతోనే మనం విజయం సాధిస్తాం’ - మంచు విష్ణు

‘ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ 21 రోజులు ఇంట్లోనే ఉండండి. కుటుంబసభ్యులకు సమయాన్ని కేటాయించండి’ - కల్యాణ్‌రామ్‌

‘హ్యాపీ ఉగాది.!! కరోనా వైరస్‌ రావడం వల్ల ప్రస్తుతం ఉన్న దురదృష్టకరమైన పరిస్థితుల్లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ ఏడాది పండుగను సరదాగా జరుపుకోలేమని నాకు తెలుసు. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రతతోపాటు, పలు జాగ్రత్తలను పాటించడం వల్ల త్వరలోనే కరోనా నివారణతో దేశం మొత్తం కలిసి ఓ పెద్ద పండుగను జరుపుకొందాం అని ఆశిద్దాం’ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని