ఇదేనా కరోనాపై పోరాడే తీరు?: నటి ఆగ్రహం
close
Published : 25/03/2020 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదేనా కరోనాపై పోరాడే తీరు?: నటి ఆగ్రహం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల తీరుపై కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముఖానికి కట్టుకున్న మాస్కులను జనాలు ఎక్కడపడితే అక్కడ విసిరేశారని పేర్కొన్నారు. వివిధ ప్రదేశాల్లో మాస్కులు ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. ‘వావ్‌.. ఈ ఫొటోలు చాలా పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి. మీకు అనిపించడం లేదా..? 500 మీటర్ల పరిధిలో కనిపించిన మాస్కులు ఇవి. నిజంగా ఇవన్నీ కేవలం 500 మీటర్ల పరిధిలో దొరికినవే. మనం కరోనాతో పోరాడుతున్న తీరు ఇదేనా..?ఇలా చేయకండి. చెత్తకుండీలు ఇంకెందుకు ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి మాస్కులు కనిపిస్తే దయచేసి తిరిగి వాడొద్దు. తాకొద్దు. నా డాక్టర్‌ ఫ్రెండ్‌కి ఐసొలేషన్‌ వార్డుకు వెళ్లేదారిలో ఇవన్నీ కనిపించాయి’ అని ఆమె పోస్ట్‌ చేశారు.

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నాయి. ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు కొన్నాళ్లు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు సూచించాయి. దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని