పుట్టినరోజున ప్రకాశ్‌రాజ్‌ ఏం చేశారంటే..
close
Published : 26/03/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుట్టినరోజున ప్రకాశ్‌రాజ్‌ ఏం చేశారంటే..

ప్రభుత్వానికే కాదు మనకి కూడా బాధ్యత ఉంది

హైదరాబాద్: తన నటనతో అటు సినీ ప్రముఖులతోపాటు ఇటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుని అభిమానులతో విలక్షణ నటుడు అనిపించుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌. గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కల్లోలం కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పనుల్లేక చాలామంది ప్రజలు కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్‌.. పుదుచ్చేరి, చెన్నై, ఖమ్మం ప్రాంతాలకు చెందిన 11 మంది వర్కర్లకు షెల్టర్‌ కల్పించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్‌ వేదికగా తెలియచేశారు. 

‘నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా వ్యవసాయ క్షేత్రంలో పుదుచ్చేరి, చెన్నై, ఖమ్మం ప్రాంతాలకు చెందిన 11 మంది రోజువారీ కూలీలకు షెల్టర్‌ కల్పించాను. వారి వారి కుటుంబాలతో నేను మాట్లాడాను. కొంత డబ్బును వారి ఖాతాల్లో డిపాజిట్‌ చేసి వారికి ఆర్థికంగా సాయం చేస్తాను. మేమంతా కలిసి లాక్‌డౌన్‌ సమయాన్ని ఏవిధంగా గడుపుతున్నామనే విషయాన్ని మీకు త్వరలోనే తెలియచేస్తాను. ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు మనది కూడా. మీరు కూడా ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి బాధ్యతను స్వీకరించాలని కోరుతున్నాను. మానవత్వాన్ని చూపించండి.’ అని ప్రకాశ్‌రాజ్‌ విజ్ఞప్తి చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని