ట్విటర్‌లోకి చిరు.. మోహన్‌బాబు ఏమన్నారంటే?
close
Updated : 26/03/2020 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్విటర్‌లోకి చిరు.. మోహన్‌బాబు ఏమన్నారంటే?

హైదరాబాద్‌: చిరంజీవి.. మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌, డైలాగ్‌ డెలివరీతో చెరగని ముద్రవేశారు. ఆ తర్వాత కథానాయకుడిగానూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ‘కలెక్షన్‌ కింగ్‌’ అని అభిమానులతో ముద్దుగా పిలిపించుకున్నారు. కాగా, ట్విటర్‌ వేదికగా చిరు-మోహన్‌బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. 

తాజాగా చిరంజీవి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు. మోహన్‌బాబు కూడా ట్విటర్‌ వేదికగా చిరంజీవికి స్వాగతం పలుకుతూ ‘మిత్రమా వెల్‌కమ్‌’ అని ట్వీట్‌ చేశారు. అందుకు చిరు సమాధానం ఇస్తూ, ‘థ్యాంక్యూ మిత్రమా.. రాననుకున్నావా.. రాలేననుకున్నావా’ అంటూ ‘ఇంద్ర’లోని డైలాగ్‌తో సమాధానం ఇచ్చారు. వెంటనే మోహన్‌బాబు కూడా అదే స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. ‘ఈసారి హగ్‌ చేసుకున్నప్పుడు చెబుతాను’ అంటూ కన్నుకొడుతున్న ఇమోజీని జత చేశారు.

వీరిద్దరి మధ్య జరిగిన ట్విటర్‌ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. అభిమానులు సైతం వీరి సంభాషణ చూసి ‘ఎవరూ తగ్గలేదుగా’, ‘ఏంటో మీరు ఇలా ఫన్నీగా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది’, ‘మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్‌..’, ‘సామాజిక దూరం పాటించండి అంటే, హగ్‌ చేసుకుంటానంటారేంటి’, ‘మీ స్నేహాన్ని ఇలాగే కొనసాగించండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) డైరీ విడుదల కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, మోహన్‌బాబు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోహన్‌బాబు ముద్దు పెట్టమని కోరగా.. చిరంజీవి ఆయన్ని ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు. అంతేకాకుండా చిరంజీవికి తనకి మధ్య ఏలాంటి విభేదాలు లేవని, కళామతల్లి ముద్దు బిడ్డలమని మోహన్‌బాబు తెలిపారు. దీంతో చిరు-మోహన్‌బాబు ఆలింగనం చేసుకున్న ఫొటోలు అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని