సితార.. గోల్డెన్‌ రూల్స్‌ ఇవే..!
close
Published : 27/03/2020 14:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సితార.. గోల్డెన్‌ రూల్స్‌ ఇవే..!

వీడియో షేర్‌ చేసిన సూపర్‌స్టార్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార.. కరోనా వైరస్‌ నివారణకు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన గోల్డెన్‌ రూల్స్‌ను గురించి తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడయోను మహేశ్‌ తన ట్విటర్‌ ఖాతా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘గోల్డెన్‌ రూల్స్‌.. చిన్నారులు చెప్పినప్పుడు మనం వినాలి’ అని ఆయన పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో నివారణకు ప్రతి ఒక్కరూ ఈ గోల్డెన్‌ నియమాలను తప్పకుండా పాటించండి. మీకు కరోనా లక్షణాలు (పొడి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది) ఉన్నట్లు అయితే తప్పకుండా మాస్క్‌ను ధరించండని సితార పేర్కొంది. అవేంటో చూద్దామా.. 

1.ఇంట్లోనే ఉండండి. సామాజిక దూరం పాటించండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు ఇళ్లు వదిలి బయటకు రాకండి.

2.తరచూ చేతులను 20 నుంచి 30 సెకన్లపాటు కడుక్కోండి. అలాగే హ్యాండ్‌ శానిటైజర్లను కూడా వాడండి.

3.ఒకవేళ మీకు కనుక తుమ్ములు, దగ్గు వచ్చినట్లు అయితే వెంటనే మోచేతిని లేదా టిష్యూను అడ్డుపెట్టుకోండి. అరచేతిలో తుమ్మకండి, దగ్గకండి.

4.మీ చుట్టూ ఉండే వాళ్ల నుంచి కనీసం మూడు అడుగుల దూరం పాటించండి
5. చేతులతో ముఖం, కళ్లు, ముక్కును తాకకండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని