చరణ్‌ బర్త్‌డే: పాత ఫొటోలు వైరల్‌
close
Published : 27/03/2020 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరణ్‌ బర్త్‌డే: పాత ఫొటోలు వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రామ్‌చరణ్‌. మాస్‌ కమర్షియల్‌ సినిమాలే కాదు, ‘రంగస్థలం’ వంటి నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం.. రణం.. రుధిరం’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఎన్టీఆర్‌ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా చరణ్‌ చిన్నప్పటి ఫొటోలు, అరుదైన సందర్భాల్లో దిగిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆయన తండ్రి చిరంజీవి కూడా ట్విటర్‌ వేదికగా ఓ ఫొటోను పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. అలాంటి ఫొటోలు మీరూ చూసేయండి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని