అప్పటి రోజులు గుర్తుకువచ్చాయ్‌
close
Updated : 28/03/2020 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పటి రోజులు గుర్తుకువచ్చాయ్‌

సోషల్‌మీడియాలో కాజల్‌ పోస్ట్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ పని తనకు చిన్నప్పటి రోజులను గుర్తు చేశాయని ప్రముఖ నటి కాజల్‌ అంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైనవారి కోసం 1987లో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘రామాయణ్‌’, ‘మహాభారత్‌’ సీరియళ్లను ప్రతిరోజూ పునఃప్రసారం చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. దీంతో శనివారం నుంచి దూరదర్శన్‌లో ఇవి ప్రసారమవుతున్నాయి.

‘కుటుంబసభ్యులతో కలసి దూరదర్శన్‌ ఛానల్‌లో ప్రసారమయ్యే రామాయణ్‌, మహాభారత్‌ సీరియల్స్‌ చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకువచ్చాయి. అప్పట్లో మా వారాంతాలు వీటితోనే గడిచేవి. ఆనాటి ఆణిముత్యాలు పునఃప్రసారం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. పురణాల గురించి చిన్నారులు తెలుసుకోడానికి ఇదో మంచి మార్గం’ అని కాజల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని