‘మహానుభావుడు’ స్టిల్స్‌తో శర్వా సందేశం 
close
Published : 29/03/2020 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మహానుభావుడు’ స్టిల్స్‌తో శర్వా సందేశం 

ఆకట్టుకునేలా సందేశం ఇచ్చిన హీరో

హైదదరాబాద్‌: తాను కథానాయకుడిగా నటించిన ‘మహానుభావుడు’ స్టిల్స్‌తో టాలీవుడ్‌ యువ హీరో శర్వానంద్‌ వినూత్నంగా సందేశాన్నిచ్చారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్‌ ఓసీడీ(ఓవర్ క్లీనింగ్‌ డిజార్డర్‌)తో బాధపడుతున్నట్లు చూపిస్తారు. కరోనావైరస్‌ నివారణకు.. నమస్కారం చేయాలి, చేతులు కడుక్కోవాలి, సామాజిక దూరం పాటించాలి అని ప్రస్తుతం మనం చెప్పుకొంటున్న నియమాలను అప్పట్లో ‘మహానుభావుడు’ చిత్రంలోని శర్వానంద్‌ పాత్ర ద్వారా మారుతి ప్రజలకు చూపించారు. ఆ సినిమాలో శర్వానంద్‌ పాత్ర చూసి నవ్వుకున్నాం కానీ ఇప్పుడు మనం అలాంటి పద్ధతులనే పాటించక తప్పడం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కాగా, ఆదివారం ట్విటర్‌లోకి అడుగుపెట్టిన శర్వానంద్‌.. తన అధికారిక ఖాతా నుంచి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తూ పలు ట్వీట్లు పెట్టారు. అయితే ఆయన చెప్పాలనుకున్నా విషయాన్ని తన ‘మహానుభావుడు’ సినిమాలోని స్టిల్స్‌ను పోలిన కార్టూన్స్‌తో చాలా విభిన్నంగా చెప్పారు. ‘మన ప్రపంచం, మన దేశం, మన ప్రజల కోసం ప్రతి ఒక్కరం ‘మహానుభావుడు’గా మారదాం’ అని శర్వా పేర్కొన్నారు.

సమూహాలకు దూరంగా ఉండండి

మూడు అడుగుల దూరం పాటించండి

షేక్‌హ్యాండ్స్‌ వద్దు.. నమస్కారం చేయండి

శానిటైజ్‌ చేసుకునే వరకూ మీ చేతులతో ముఖాన్ని తాకకండి

ప్రజలు ఉపయోగించే డోర్‌ నాబ్స్, హ్యాండిల్స్‌, మెట్లకు ఉండే రైలింగ్‌ను పట్టుకోకండి. ఒకవేళ పట్టుకున్నా సరే వెంటనే చేతులను శుభ్రం చేసుకోండి.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని