అల్లు అర్జున్‌.. ఈ స్టెప్పు ఎలా వేశారు?
close
Published : 31/03/2020 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు అర్జున్‌.. ఈ స్టెప్పు ఎలా వేశారు?

నటి పోస్ట్‌.. రిప్లై ఇచ్చిన బన్నీ

హైదరాబాద్‌: ‘స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ ఫిదా అయ్యారు. బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని ‘బుట్టబొమ్మ..’ పాటను చూసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. ఓ షాట్‌లో బన్నీ బల్లపై నుంచి కిందికి జారుతున్న వీడియోను షేర్‌ చేశారు. ‘అల్లు అర్జున్‌ ఈ స్టెప్పు మీరెలా వేశారు’ అని అడిగారు. దీన్ని చూసిన బన్నీ.. ‘నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. మంచి మ్యూజిక్‌ నాతో డ్యాన్స్‌ చేయిస్తుంది. నీ ప్రశంసకు ధన్యవాదాలు’ అని రిప్లై ఇచ్చారు. ‘మాకు స్ఫూర్తిగా ఉన్నందుకు థాంక్యూ అల్లు అర్జున్‌’ అని దిశా ప్రతిస్పందించారు.

దిశా నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. ఆమె వేసే స్టెప్పులకు ఎందరో అభిమానులున్నారు. బాలీవుడ్‌ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం ఉంది. దీనికి తోడు దిశా.. టైగర్‌, ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటున్నారు. దీని గురించి వీరిని ప్రశ్నించగా.. మేం మంచి స్నేహితులమని చెప్పారు. బన్నీ కుమారుడు టైగర్‌కు వీరాభిమాని. ఆయన నటించిన ‘బాఘి’ ఫ్రాంచైజ్‌ అంటే అయాన్‌కు చాలా ఇష్టమట. అంతేకాదు టైగర్‌  సినిమా సెట్‌కు తనను ఆహ్వానించాలని అయాన్‌ ఇటీవల కోరాడు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని