‘కనిపించని పురుగు’ చేతులు కడుక్కొని వినండి
close
Updated : 01/04/2020 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కనిపించని పురుగు’ చేతులు కడుక్కొని వినండి

కరోనాపై పాట పాడిన ఆర్జీవీ

హైదరాబాద్‌: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పై టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రత్యేకంగా ఓ పాటను రాసి స్వయంగా ఆలపించారు. కరోనా వైరస్‌ను ఓ పురుగుతో పోలుస్తూ.. ‘కనిపించని పురుగు’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ఆయన బుధవారం ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. చేతులు కడుక్కొన్నాకే ఈ పాటను వినాలని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘అదియూ ఒక్క పురుగు.. కనిపించని పురుగు.. కరోనా నీవొక పురుగు.. నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి. పచ్చడి చేద్దామంటే కండ లేదు దానికి. అదే దాని బలం.. అదే దాని దమ్ము’ అంటూ సాగే ఈ పూర్తి పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తానని ఆర్జీవీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి.. సమాజంలో కొందరు ప్రజలు ఎలా ఉంటున్నారే విషయాన్ని తెలియచేస్తూ ఆయన సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే పలు ట్వీట్లు చేశారు.

గతేడాది విడుదలైన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ  ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. 

ఇవీ చదవండి

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది..

ఎక్కడిదీ కరోనా.. ఏమిటీ కరోనా



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని