మా వంతుగా చిన్న సాయం చేస్తున్నాం
close
Published : 04/04/2020 10:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా వంతుగా చిన్న సాయం చేస్తున్నాం

మోదీ ప్రశంసపై చిరు స్పందన

హైదరాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిలో తమ వంతు సాయం చేస్తున్నామని టాలీవుడ్‌ అగ్రకథనాయకుడు చిరంజీవి అన్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరాలు అందించిన ఓ పాటలో చిరంజీవి, నాగార్జున, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ నటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ వీడియో చూసిన మోదీ టాలీవుడ్‌ హీరోలను పేరు పేరునా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి తన ట్విటర్‌ ఖాతా వేదికగా మోదీ ప్రశంసపై స్పందించారు. ‘మీ ప్రశంసకు ధన్యవాదాలు మోదీ గారు. మనదేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి మహాకార్యంలో మేము మా వంతుగా చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటి, మా అందరి తరఫున మీకు నా ధన్యవాదాలు’ అని చిరు ట్వీట్‌ చేశారు.  

కరోనా వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చిరంజీవి పలు వీడియోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల చిరంజీవి, నాగార్జున, యువ కథానాయకులు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి కరోనాపై అవగాహన కల్పించే విధంగా రూపొందించిన ‘వి గోనా ఫైట్‌ కరోనా ఏదేమైనా... చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా’ అంటూ సాగే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది . ఈ పాటను విన్న ప్రధాని నరేంద్రమోదీ ఆయా హీరోలను ప్రశంసించారు. ‘చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌.. మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి ధన్యవాదాలు. అందరం మన ఇళ్లలోనే ఉందాం. సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.’ అని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని