లాక్‌డౌన్‌ వేళ.. సుమ సాయం ఇలా..
close
Published : 04/04/2020 21:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ వేళ.. సుమ సాయం ఇలా..

హైదరాబాద్‌:కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో సినీ, టీవీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత సుమ వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు.

తన దగ్గర ప్రత్యక్షంగా పనిచేస్తున్న కార్మికులతోపాటు పరోక్షంగా పనిచేస్తున్న వారికి కూడా తగినంత ఆర్థికసాయం చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నమస్కారం. కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న తరుణంలో నేను కూడా నావంతు సాయం చేశాను. కొన్ని వృద్ధాశ్రమాలకు, నిర్మాతల మండలికి సాయం అందించాను. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్‌ లిస్ట్‌ తయారు చేసుకున్నాను. వాళ్ల అవసరాలను అడిగి తెలుసుకున్నాను. అలాగే నా షోల కోసం పనిచేస్తున్న మరికొంతమంది లిస్ట్‌ తయారుచేసుకున్నాను. వాళ్లు ఎలాంటి సంఘాల్లో కూడా సభ్యులు కారు. అయితే అవసరాలు ఉన్నా వారందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను వెళ్లి సామగ్రిని అందించలేను. కాబట్టి నాకు వీలైనంత ఆర్థిక సాయం చేస్తాను. మీరు కూడా ఇలా డైరెక్ట్‌ స్టాఫ్‌, ఇన్‌డైరెక్ట్‌ స్టాఫ్‌ లిస్ట్‌లు తయారు చేసుకుంటే సాయం చేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది.’ అని సుమ తెలిపారు.

నయనతార సాయం..

నయనతార సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.20 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈమేరకు ఆమె ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాకు చెక్కును అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని