250 మురికివాడ కుటుంబాలకు రకుల్‌ సాయం
close
Published : 04/04/2020 21:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

250 మురికివాడ కుటుంబాలకు రకుల్‌ సాయం

లాక్‌డౌన్‌ ముగిసేంత వరకు ఫుడ్‌ పంపిస్తా: నటి

దిల్లీ: ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ క్లిష్ట సమయంలో పేదవారికి తనవంతు సహాయం చేస్తున్నారు. గుర్గావ్‌లోని తన ఇంటికి దగ్గరున్న మురికివాడలోని కుటుంబాలకు రోజుకు రెండు పూట్ల ఆహారం పంపిణీ చేస్తున్నారు. శనివారం నుంచి లాక్‌డౌన్‌ కాలం ముగిసేంత వరకు వీరికి ఇలానే ఆహారం పంపిస్తానని ఆమె తాజాగా ఓ వైబ్‌సైట్‌తో అన్నారు. ‘ప్రస్తుతం మురికివాడలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వారి పరిస్థితి ఎలా ఉందని మా నాన్న తెలుసుకున్నారు. రోజుకు రెండుసార్లు భోజనం పంపిణీ చేస్తున్నాం. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కూడా ఆహారం పంపిణీ చేస్తాం. ఇప్పటికైతే ఏప్రిల్‌ వరకు ఇలా చేయాలి అనుకుంటున్నా. ఆ తర్వాత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలి. మా ఇంటికి సమీపంలో ఆహారాన్ని వండి, వారికి పంపుతున్నాం. ఇలాంటి కష్ట సమయంలో ప్రతి ఒక్కరు తమవంతు సాయం చేయాలి’.

‘మనలో చాలా మందికి ఇల్లు, తినడానికి ఆహారం ఉంది. అత్యవసరానికి దాచుకునే స్థితిలో ఉన్నాం. దీన్ని అదృష్టంగా భావించాలి. ఎవరి భోజనం వారు తింటున్నప్పుడు వారి ముఖంలో వచ్చే చిరునవ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా చిన్న సహాయం చేస్తున్నా. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని ఆమె పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని