తమన్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన పవన్‌
close
Published : 04/04/2020 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన పవన్‌

సంబరపడ్డ సంగీత దర్శకుడు

హైదరాబాద్‌: సంగీత దర్శకుడు తమన్‌కు శనివారం ఉదయాన్నే ఓ సర్‌ప్రైజ్‌ ఎదురైంది. అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో ఆయన్ను ఫాలో అవుతున్నారట. ఈ విషయాన్ని నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకున్న ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ‘ఇది నాకు అతి పెద్ద ఫ్యాన్‌ మూమెంట్‌. నా రోజును ఆనందంగా ప్రారంభించడానికి ఇంత కంటే మంచి కారణం ఏం కావాలి. వపన్‌ సర్‌ మీపై నాకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. లవ్‌ యూ సర్‌’ అని ట్వీట్‌ చేశారు.

పవన్‌ను ట్విటర్‌లో 3.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన మాత్రం కేవలం 34 మందిని అనుసరిస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నారు. మోదీ, అమిత్‌షా, కేటీఆర్‌, అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవి, రామ్‌ చరణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, తమన్‌ తదితరుల్ని పవర్‌స్టార్‌ ఫాలో అవుతున్నారు. పవన్‌ ఇటు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఆయన ‘వకీల్‌ సాబ్‌’కు సంతకం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని