కరోనాపై రఘు కుంచె మాస్‌ సాంగ్‌
close
Updated : 04/04/2020 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై రఘు కుంచె మాస్‌ సాంగ్‌

హైదరాబాద్‌: కరోనాపై పోరాటం చేసేందుకు సినీ ప్రముఖులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర తారలందరూ భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులను, ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇక సంగీత దర్శకులు కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్‌, వాసూరావులతో పాటు గీత రచయితలు అనంత్‌ శ్రీరామ్‌, చంద్రబోస్‌లు కరోనాపై అవగాహన పాటలతో అలరిస్తున్నారు.

తాజాగా గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కూడా ఈ జాబితాలో చేరారు. అందరూ క్లాస్‌గా కరోనాపై పాట పాడితే, రఘు కుంచె మాస్‌.. కాదు కాదు.. ఊరమాస్‌ సాంగ్‌ అందుకున్నారు. ‘సెప్పిన మాట వినకుంటే ఓరి నాయనా..’ అంటూ సిరాశ్రీ అందించిన సాహిత్యాన్ని తనదైన శైలిలో ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని