ఈ వీడియోతో నన్ను ఏడిపించారు: రష్మిక
close
Published : 06/04/2020 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ వీడియోతో నన్ను ఏడిపించారు: రష్మిక

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో జోరుమీదున్న కథానాయిక రష్మిక. ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి సినిమాలతో యువతను ఆకట్టుకున్న ఆమె ఆదివారం 24వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు దేవిశ్రీ ప్రసాద్‌, రాశీ ఖన్నా, హరిప్రియ తదితరులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. వీరితోపాటు అభిమానులు ఆమెను విష్‌ చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రష్మిక సినిమాల్లోని సీన్లను కలిపి ఓ వీడియోగా రూపొందించారు. రష్మికది స్ఫూర్తిదాయకమైన జీవితమని, ఈ వీడియోను పూర్తి గౌరవంతో ఎడిట్‌ చేశానని అన్నారు. దీన్ని చూసిన రష్మిక కన్నీరుపెట్టుకున్నారు. ‘నువ్వు నన్ను భావోద్వేగానికి గురి చేశావు. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వీడియోను బాగా ఎడిట్‌ చేశావు. ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు.

రష్మిక 2012లో మోడల్‌గా కెరీర్‌ ఆరంభించారు. ఆపై ‘క్లీన్‌ అండ్‌ క్లియర్‌’ ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్నారు. అలా సినిమాల్లోకి వచ్చారు. రష్మిక ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయం అందుకున్నారు. దీని తర్వాత ఆమె నటించిన ‘భీష్మ’ కూడా హిట్‌ అయ్యింది. ప్రస్తుతం ఆమె కన్నడలో ‘పొగరు’, తమిళంలో ‘సుల్తాన్‌’లో నటిస్తున్నారు. తెలుగులో అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కథానాయిక పాత్ర పోషించబోతున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని