ఇది ఈవెంట్‌ కాదు.. మూవ్‌మెంట్‌
close
Updated : 06/04/2020 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది ఈవెంట్‌ కాదు.. మూవ్‌మెంట్‌

కరోనాపై గెలుస్తాం.. గెలిచి తీరతాం..

హైదరాబాద్‌: కరోనావైరస్‌పై చేస్తున్న పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని నటుడు సాయికుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని రూపొందించి ప్రజలతో పంచుకున్నారు.

‘జై భారత్‌. నా తోటి భారతీయులకు నమస్కారం. మీలో ఒక్కడినైనందుకు గర్వపడుతున్నాను. మన ప్రియతమ ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ అంటే  పాటించాం. లాక్‌డౌన్‌ అంటే లాక్‌ అయ్యాం. చప్పట్లు కొట్టమంటే కొట్టాం. దీపాలు వెలిగించమంటే వెలిగించాం. ఇది ఒక ఈవెంట్‌ కాదు.. మూవ్‌మెంట్‌. ఇది ప్రజల ఉద్యమం. మనం చేసింది, చేస్తోంది మోదీ కోసం కాదు.. మన కోసం. ఈ రోజు కరోనా ప్రపంచమంతా విలయతాండవం చేస్తోంది. న్యూయార్క్‌ నుంచి న్యూదిల్లీ వరకూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.. పోగొట్టుకుంటున్నారు. జీవితం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి పరిష్కారం ఒక్కటే.. సామాజిక దూరం. ఇళ్లల్లో ఉండండి. ప్రభుత్వ నియమాలను ఆచరించండి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. జోకులొద్దు.. విమర్శలొద్దు.. రాజకీయ స్వార్థాలు వద్దు. మనకెందుకులే.. మనకు రాదులే అనే నిర్లక్ష్యం అసలే వద్దు. మతం, కులం, భాష, వర్గం.. వీటన్నింటికీ అతీతంగా మనమందరం భారతీయులుగా ఐక్యమత్యంగా ఈ కరోనాపై పోరాడదాం. గెలుస్తాం.. గెలిచి తీరతాం.’ అని సాయి కుమార్‌ పేర్కొన్నారు.

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని