పదిలో 9 మంది అతడి పేరే చెప్పారు: జక్కన్న
close
Published : 06/04/2020 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదిలో 9 మంది అతడి పేరే చెప్పారు: జక్కన్న

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ కనిపించనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జక్కన్న-అజయ్‌ కలిసి పనిచేస్తున్న ప్రాజెక్టు ఇది. ‘ఈగ’ సినిమాను హిందీలో విడుదల చేయాలని రాజమౌళి అనుకున్నప్పుడు అజయ్‌, కాజోల్‌ను కలిశారు. హిందీ వెర్షన్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు ఇద్దరు వెంటనే ఒప్పుకొన్నారు. ఇన్నేళ్లకు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం మళ్లీ చేతులు కలిపారు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోని పాత్రకు అజయ్‌ను తీసుకోవడానికి గల కారణాన్ని రాజమౌళి ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. ‘ఈ సినిమాకు అజయ్‌ సర్‌ పాత్ర చాలా ముఖ్యం. ఆయన పాత్ర చాలా బాగుంటుంది. ముఖంలో, ఉచ్ఛరించే ప్రతి మాటలో నిజాయితీ, సమగ్రత ఉండే నటుడి కోసం వెతుకుతున్నా. ఆ నటుడి మాటల్ని, ప్రవర్తనను అందరూ నమ్మేలా ఉండాలి. నటుడిలో ఉండాల్సిన లక్షణాలు, నా అవసరాలు కొంత మందికి చెప్పి, సలహా అడిగినప్పుడు.. పదిలో తొమ్మిది మంది అజయ్‌ దేవగణ్‌ పేరు చెప్పారు. సినిమాలోని పాత్రలో నటించేందుకు అజయ్‌ను ఒప్పుకోవడం నిజంగా సంతోషాన్నిచ్చింది. ఆయన ఎంతో అంకితభావంతో పనిచేశారు’ అని చెప్పారు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. అలియాభట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని