లాక్‌డౌన్‌లో వర్మ.. వీడియో చూడండి!
close
Published : 07/04/2020 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌లో వర్మ.. వీడియో చూడండి!

‘హ్యాపీ బర్త్‌డే టూమీ..’

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మంగళవారం తన 58వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయనే శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్‌ చేశారు. జైలులాంటి గదిలో కూర్చుని కాళ్లు ఊపుతూ ‘హ్యాపీ బర్త్‌డే టూమీ..’ అంటూ పాడిన తీరు నవ్విస్తోంది. అంతేకాదు.. పుట్టినరోజున లాక్‌డౌన్‌లో ఒంటరిగా ఉండేలా చేసిన కరోనాకు ధన్యవాదాలు తెలిపారు. దయచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అని ట్వీట్‌ కూడా చేశారు. దీన్ని చూసిన ఫాలోవర్స్‌ వర్మ  తీరే వేరంటూ కామెంట్లు చేస్తున్నారు.
మణిరత్నం సిగ్గుపడటం తొలిసారిచూశా..

దర్శకుడు మణిరత్నం సిగ్గుపడటం తొలిసారి చూశానని వర్మ మరో ట్వీట్‌ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో అదితిరావు హైదరి, కార్తి జంటగా నటించిన సినిమా ‘కాట్రు వెలియిదై’ (తెలుగులో ‘చెలియా’). ఈ సినిమా షూటింగ్‌ సమయంలో మణిరత్నంతో అదితికి స్నేహబంధం ఏర్పడింది. ఆ సెట్‌లో దర్శకుడికి మోకాలిపై నిల్చుని రోజా పువ్వు ఇస్తున్న ఫొటో తాజాగా వైరల్‌ అవుతోంది. అదితిని చూసి మణిరత్నం నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోను చూసిన వర్మ ట్విటర్‌లో స్పందించారు. ‘సూపర్‌ సీరియస్‌ మణిరత్నం సిగ్గుపడుతూ ఉండటాన్ని నేనెప్పుడూ చూడలేదు. మొదటి సారి చూస్తున్నా’ అని కామెంట్ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని