8 గ్రామాల్ని దత్తత తీసుకున్న మోహన్‌బాబు
close
Updated : 07/04/2020 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

8 గ్రామాల్ని దత్తత తీసుకున్న మోహన్‌బాబు

రోజుకు 8 టన్నుల కూరగాయలు పంపిణీ

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి ఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల ప్రజలకు వీరు అండగా నిలిచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడ ఉన్న పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను తొలగించే వరకూ ఇలా ఆహారం పంపిణీ చేయబోతున్నారు. ఇది కాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వీరిని మెచ్చుకుంటున్నారు. మోహన్‌బాబు చిత్తూరులోని మొదుగులపాలెంలో జన్మించిన సంగతి తెలిసిందే. ఆ జిల్లాలోని రంగపేట సమీపంలో ఆయన ‘శ్రీ విద్యానికేతన్‌’ పేరుతో విద్యా సంస్థల్ని స్థాపించారు.

అజిత్‌ పెద్ద మనసు..

తమిళ స్టార్‌ అజిత్‌ కరోనాపై పోరుకు రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో రూ.50 లక్షలు పీఎం-కేర్స్‌కు, రూ.50 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి, రూ.25 లక్షలు ‘ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’కు విరాళంగా ప్రకటించారు. తమిళనాడులోని సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ఇప్పటికే అనేక మంది ప్రముఖులు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని