అందుకే ఏప్రిల్‌ 8వ తేదీ చిరంజీవికి స్పెషల్‌!
close
Updated : 08/04/2020 11:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ఏప్రిల్‌ 8వ తేదీ చిరంజీవికి స్పెషల్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: రీఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాల జోరు పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కాగా, ఇటీవల సోషల్‌మీడియాలోకి వచ్చిన చిరు సూపర్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతి విషయంపైనా స్పందిస్తూ, తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్‌ 8వ తేదీతో తనకెంతో అనుబంధం ఉందని నేడు ఆ విశేషాలను చెబుతానని చిరు ట్విటర్‌ వేదికగా అన్నారు. చెప్పినట్లుగానే, వరస ట్వీట్లతో ఏప్రిల్‌ 8తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

భద్రంగా దాచుకున్న హనుమంతుడి ఫొటో!

తన చిన్నప్పుడు లాటరీలో హనుమంతుడి ఫొటో వచ్చిందని దానిని భద్రంగా దాచుకున్నానని చిరు చెప్పారు. ‘‘ఈ రోజు హనుమజ్జయంతి. చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉంది. 1962లో నాకు ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది. ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, ‘ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు  అలానే ఉన్నాయి’ అన్నారు. అప్పటి నా ఫొటో ఇదే’’ అని ట్వీట్‌ చేశారు.

బాపు గీసిన బొమ్మ!

చాలా సంవత్సరాల తర్వాత ప్రముఖ చిత్రకారుడు బాపు తన కోసం ఆంజనేయస్వామి చిత్రాన్ని గీసి ఇచ్చారని చెబుతూ..‘‘ఇక కొన్ని దశాబ్దాల తరవాత, 2002లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు  నాకు ఇష్టమైన ఆంజనేయస్వామి చిత్రాన్ని గీసి పంపుతానన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ‘ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి. అలానే ఉంచేశాను. మార్చలేదు’ అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవాల్టి తారీఖుతో  నాకు ఇంకో అనుబంధం ఉంది’’ అని మరో ట్వీట్‌లో ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

బన్నిలోని కసి, కృషి నాకు ఇష్టం!

‘‘డ్యాన్స్‌లో గ్రేస్‌ ఆ వయస్సు నుంచే ఉంది. బన్నిలోని  కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యపీ బర్త్‌డే బన్ని! నువ్వు బాగుండాలబ్బా..’’అని అల్లు అర్జున్‌ చిన్నప్పటి ఫొటోను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.

చరణ్‌కు తమ్ముడిలాంటి వాడు అఖిల్‌

నాగార్జున కుమారుడైన అఖిల్‌కు కూడా చిరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీబర్త్‌డే అఖిల్‌. చరణ్‌కు ఒక తమ్ముడు. సురేఖ, నాకూ ఒక కొడుకులాంటి వాడు. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, అందరూ ఇష్టపడే చిన్నపిల్లవాడు. ఈ ఏడాది బాగుండాలని కోరుకుంటున్నా’’ అని అఖిల్‌ చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేశారు.

అఖీరా.. పవర్‌ఫుల్‌ ఫ్యూచర్‌

పవన్‌-రేణు దేశాయ్‌ల తనయుడు అఖీరా పుట్టిన రోజు కూడా నేడే కావడంతో తనకీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే  మించిపోవాలి. విష్‌ యు ఎ ‘పవర్‌’ఫుల్‌ ప్యూచర్‌. హ్యాపీ బర్త్‌డే అఖీరా’’ అని అఖీరా చిన్నప్పుడు ఎత్తుకున్న ఫొటోను పంచుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని