పవన్‌ కుమారుడికి మెగా హీరోల స్పెషల్‌ విషెస్‌
close
Published : 08/04/2020 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ కుమారుడికి మెగా హీరోల స్పెషల్‌ విషెస్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌-నటి రేణూ దేశాయ్‌ల తనయుడు అఖీరా పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరులు రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. అఖీరాతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ‘నా పొడవైన చిట్టి సోదరుడు అఖీరాకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు నిన్ను తన ప్రేమతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. నువ్వు ఎప్పుడూ ఇలానే దయగల వ్యక్తిగా ఉండాలి’ అని చెర్రీ పోస్ట్‌ చేశారు.

‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.. నేను తల ఎత్తి చూడగలిగే తమ్ముడు నువ్వు (నవ్వుతున్న ఎమోజీలు). ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలి అఖీరా’ అని వరుణ్‌తేజ్‌ ట్వీట్ చేశారు. ‘నా చిట్టి తమ్ముడు అఖీరాకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నా’ అని సాయిధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ చేశారు.

అఖీరా తల్లి రేణూ దేశాయ్‌ కూడా తన కుమారుడి పుట్టినరోజు సందర్భంలో ఓ పోస్ట్‌ చేశారు. చాలా ఏళ్ల క్రితం తీసుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నా చిట్టితండ్రికి ఇప్పుడు 16 ఏళ్లు. మీ అమ్మ ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

బుధవారం జన్మదిన వేడుకలు జరుపుకుంటోన్న బన్నీకి కూడా చెర్రీ విషెస్‌ చెప్పారు. బాల్యంలో బన్నీ తనకు కేకు తినిపిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ. ‘నేను ఇవాళ నీకు కేకు తినిపించి ఉండాల్సింది. కానీ దానికి బదులుగా మన బాల్యంలోని ఈ మధురజ్ఞాపకాల్ని పంచుతున్నా. నీ పుట్టినరోజును గొప్పగా జరుపుకో.. ‘పుష్ప’ పోస్టర్‌ చాలా బాగుంది’ అని కామెంట్‌ చేశారు.

అదేవిధంగా అక్కినేని అఖిల్‌కు కూడా చరణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘నువ్వు చేసే పనిపట్ల చూపించే ఉత్సాహం చూసిన ప్రతిసారి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నీలో ఈ ఉత్సాహాన్ని ఇలానే ఉంచుకోవాలి. హ్యాపీ బర్త్‌డే అఖిల్‌’ అని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని