రియల్‌ హీరోల కోసం సోనుసూద్‌ ఏం చేశారంటే
close
Published : 09/04/2020 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియల్‌ హీరోల కోసం సోనుసూద్‌ ఏం చేశారంటే

ముంబయి: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మన సంక్షేమం కోసం ఎంతో శ్రమిస్తున్న నిజ జీవిత హీరోల కోసం ప్రముఖ నటుడు సోనుసూద్‌ తన వంతు సాయం చేశారు. కరోనా కట్టడిలో భాగంగా తమ కుటుంబాలను వదిలి మన సంక్షేమం కోసం పాటుపడుతోన్న ఆరోగ్య కార్మికుల కోసం ముంబయి, జుహులోని తన హోటల్‌ను కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో మన సంక్షేమం కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్న ఆరోగ్య కార్మికుల కోసం జుహులోని నా హోటల్‌ను కేటాయిస్తున్నాను. వాళ్లు నిర్వర్తిస్తున్న గొప్ప బాధ్యతలకు మనం ఇస్తున్న చిన్న సాయం ఇది. అందరూ ముందుకు వచ్చి.. వారికి సపోర్ట్‌ చేయండి.’ అని సోనుసూద్‌ పేర్కొన్నారు.

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5734 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 166 మంది మరణించారు. ఇప్పటివరకూ ఈ మహమ్మారితో పోరాడి 473 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1135 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని