సాయం చిన్నదా?పెద్దదా? ముఖ్యం కాదు
close
Published : 10/04/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయం చిన్నదా?పెద్దదా? ముఖ్యం కాదు

హైదరాబాద్‌: సాయం చిన్నదా? పెద్దదా? అనేది ముఖ్యంకాదని, కానీ మనం చేసే ఎలాంటి సాయం వల్ల అయినా ఎదుటివారికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబపోషణలో ఇబ్బంది ఎదుర్కొంటున్న గురుగ్రామ్‌లోని మురికివాడలో నివసిస్తున్న 200 మందికి నెలరోజులపాటు భోజనం అందిస్తానని ఇటీవల రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రకుల్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ అవసరమైనవారికి తగినంత సాయం చేయాలని తెలిపారు. ‘ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం.. మా సొసైటీలో తయారు చేసిన ఫుడ్‌ను మా నాన్న, కొంతమంది స్టాఫ్‌ కలిసి వెళ్లి ఎన్జీవో సాయంతో మురికివాడలోని ప్రజలకు అందిస్తున్నాం. ఆరోగ్యవంతమైన ఆహారాన్నే వాళ్లకి పంపిస్తున్నాం. అలాగే వాళ్లకి పంపిణీ చేసే సమయంలో కూడా సామాజిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని రకుల్‌ తెలిపారు. 

‘సాయం అనేది పెద్దదా? లేక చిన్నదా? అనేది ముఖ్యం కాదని నా అభిప్రాయం. మీరు చేసే చిన్న సాయం కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని నేను నమ్ముతాను. చిన్నప్పటి నుంచి నేను అలాగే పెరిగాను. 18 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నేను పనిచేయడం ప్రారంభించాను. నా మొదటి నెల జీతాన్ని మా నాన్న గురుద్వార్‌లో విరాళంగా ఇప్పించారు. నేను అనుభవిస్తున్న సౌకర్యాలకు ఎంతో కృతజ్ఞరాలిని. అలాగే వేరొకరి కోసం సాయం చేయగలిగిన సామర్థ్యం నాకు ఉంది’ అని రకుల్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని