మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి
close
Published : 12/04/2020 11:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు. సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే ఆయన 2017లో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌1’ రియాల్టీషోతో తొలిసారి బుల్లితెర వ్యాఖ్యాతగా  ప్రతివారం ఇంటిల్లిపాదిని పలకరించారు. ప్రస్తుతం కరోనా కల్లోలం విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం విధితమే. లాక్‌డౌన్‌ కారణంగా పలు ధారావాహికల షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఆయా సమయాల్లో గతంలో ప్రేక్షకులను అలరించిన కార్యక్రమాలను పునఃప్రసారం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ని పునఃప్రసారం చేస్తుండగా.. తాజాగా ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌ సీజన్‌1’నూ నేటి నుంచి పునఃప్రసారం చేయనున్నారు. దీంతో ట్విటర్‌ వేదికగా ఎన్టీఆర్‌ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్లు, రీట్వీట్లు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం #NTRsBiggBossReTelecast అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో దూసుకెళ్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని