కేటీఆర్‌ పంచ్‌కి నా ముక్కు వాచిపోయింది: వర్మ
close
Published : 12/04/2020 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేటీఆర్‌ పంచ్‌కి నా ముక్కు వాచిపోయింది: వర్మ

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పంచ్‌కి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ముక్కు వాచిపోయిందట. వర్మ శుక్రవారం మద్యాన్ని ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత పలు ప్రాంతాల్లో మద్యం దొరక్క కొందరు వింత ప్రవర్తనలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొందరు ఆ బాధను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ నిర్ణయం తీసుకున్నారని, మద్యాన్ని హోమ్‌ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వదంతులు వచ్చాయి. అయితే ఈ వార్తలో నిజం లేదని పశ్చిమ బంగా ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా స్పష్టం చేశారని ఓ వెబ్‌సైట్‌ రాసింది.

పశ్చిమ బంగాలో నిజంగానే మద్యాన్ని హోమ్‌ డెలివరీ చేయబోతున్నారని తప్పుగా అర్థం చేసుకున్న వర్మ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఉద్దేశిస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌, జగన్‌ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జనాలు ఇంట్లో బోర్‌ కొట్టి జుట్టు పీక్కుంటున్నారని, చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారని అన్నారు. పిచ్చిపట్టి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, చిరాకులో భార్యలపై చేయి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మీరు కూడా మమతా బెనర్జీలా పెద్ద మనసు చేసుకోండంటూ కేటీఆర్‌, కేసీఆర్‌, జగన్‌ను ట్యాగ్‌ చేశారు.

వర్మ ట్వీట్‌ చూసిన కేటీఆర్‌ స్పందించారు. ‘వర్మ గారు.. మీరు మాట్లాడుతోంది హెయిర్‌ కట్స్‌ గురించే అనుకుంటా..?’ అని కౌంటర్ ఇచ్చారు. దీన్ని ఆదివారం చూసిన వర్మ రిప్లై ఇచ్చారు. ‘కేటీఆర్‌ సర్‌.. మీ రిప్లైను చూసుకోలేదు. నాకు మీ హాస్యచతురత ఎంతో ఇష్టం. మీ బాక్సింగ్‌ పంచ్‌కి నా ముక్కు ఎర్రగా వాచిపోయింది. మీ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్ని మెచ్చుకుంటున్నా’ అని పేర్కొన్నారు. వర్మ ట్వీట్‌ను కేటీఆర్‌ లైక్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని