పోలీసులకు శ్రీకాంత్‌ సాయం
close
Published : 13/04/2020 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసులకు శ్రీకాంత్‌ సాయం

జర్నలిస్టులకు నిత్యావసరాలు అందించిన హరీశ్‌ శంకర్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడి కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులను ప్రశంసించడమే కాకుండా తమ వంతు సాయం అందించడానికి పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ పోలీసులకు శానిటైజర్లు, ఆహారాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులకు, ఇతర సిబ్బందికి వీటిని అందించి క్లిష్ట సమయంలో పోలీసులు చేస్తున్న సేవలను శ్రీకాంత్‌ కొనియాడాడు. 

మరోవైపు టాలీవుడ్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సైతం కరోనా మహమ్మారి గురించి ప్రజలకు అన్ని విధాలుగా అవగాహన కల్పించేందుకు పనిచేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. 100 మంది పార్ట్‌టైమ్‌ జర్నలిస్టులకు ఆయన ఈ నిత్యావసరాలను అందించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని