‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి నాగబాబు ఏమన్నారంటే
close
Published : 13/04/2020 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి నాగబాబు ఏమన్నారంటే

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం)’. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం గురించి నాగబాబు స్పందించారు. ఇటీవల విడుదలైన ‘భీమ్‌ఫర్‌రామరాజు’ వీడియో ఎంతగానో ఆకట్టుకుందని, అలాగే ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమరంభీమ్‌ పాత్రకు సంబంధించిన ప్రోమో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన ఇటీవల ఫేస్‌బుక్‌ లైవ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే ఫేస్‌బుక్‌లైవ్‌లో సమాధానం చెప్పని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ తాజాగా ఓ వీడియోను రూపొందించి తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఉంచారు. 

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాపై నా అభిప్రాయం గురించి ఇటీవల ఫేస్‌బుక్‌ లైవ్‌లో కొందరు నన్ను అడిగారు. అప్పుడు ఎవరికైతే సమాధానం చెప్పలేదో వారికోసమే ఈ వీడియో.. రామ్‌చరణ్ బర్త్‌డే రోజున అతను పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రను తెలియజేసే విధంగా విడుదల చేసిన స్పెషల్‌ వీడియో చూశాను. ఆ వీడియో చూశాక.. రామరాజు పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కొమరం భీమ్‌ ఎలా ఉండనున్నాడో చూడాలనే ఆతృత ఎక్కువైంది. ఆ చిత్రబృందం ఫస్ట్‌ ప్రోమోతోనే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా గురించి నేను విన్న కథేంటంటే.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌.. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాల్లోని మన్యం, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం యుద్ధం చేసిన విప్లవ వీరులు. ఒకవేళ వీరిద్దరు ఎక్కడైనా కలిసి ఉంటే ఎలా ఉండేది అనే కోణాన్ని ఇందులో చూపించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ కథ ఇదే అయి ఉండవచ్చు. లేకపోతే వేరే కథ కూడా అయి ఉండవచ్చు. కానీ ఏదైనా సరే ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది.’ అని నాగబాబు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని