సమంత ఎప్పుడూ వంట చేయలేదు: అమల
close
Published : 14/04/2020 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత ఎప్పుడూ వంట చేయలేదు: అమల

హైదరాబాద్‌: తన కోడలు సమంత కుటుంబ సభ్యుల కోసం ఎప్పుడూ వంట చేయలేదని సీనియర్‌ నటి అమల చెప్పారు. నటన పరంగా సామ్‌ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో దక్షిణాదిలోనే అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. 2017లో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంటికి కోడలయ్యారు. కాగా సామ్‌ కుటుంబ సభ్యుల కోసం వంట చేస్తారా? అని తాజాగా ఓ మీడియా ప్రతినిధి అమలను ప్రశ్నించింది. దీనికి అమల స్పందిస్తూ.. ‘లేదు..’ అన్నారు. అనంతరం నవ్వుతూ.. ‘అక్కినేని కుటుంబంలో మంచి కుక్‌ నాగార్జున ఉన్నాడు. అలాంటప్పుడు వంట చేయడానికి ప్రత్యేకంగా మరొకర్ని తీసుకోవడం ఎందుకు?’ అని చెప్పారు. నాగార్జున అద్భుతమైన నటుడే కాదు.. పాకశాస్త్రంలోనూ పట్టుఉన్న వ్యక్తని ఇలా అమల అభిమానులకు తెలియజేశారు. సామ్‌కు మాత్రమే కాదు.. అమలకు కూడా వంట చేయడం అంతగా రాదట.

చైతన్య ఇప్పటికే అనేక సందర్భాల్లో వంట చేశారని సమంత చెప్పారు. ఆయన వంటగదిలో ఉండగా తీసిన ఫొటోలను కూడా షేర్‌ చేశారు. క్వారంటైన్‌ సమయంలో చైతన్య రుచికరమైన ఆహారం వండాడంటూ ఇటీవల సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్‌ చేశారు. చైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. సామ్‌ ‘జాను’ తర్వాత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించబోతున్నారు. ఇది కాకుండా ఆమె చేతిలో ఇప్పుడు రెండు ప్రాజెక్టులున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని