ఫ్లకార్డ్స్‌తో మెగా ఫ్యామిలీ.. మాస్క్‌తో మహేశ్‌..! 
close
Published : 15/04/2020 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లకార్డ్స్‌తో మెగా ఫ్యామిలీ.. మాస్క్‌తో మహేశ్‌..! 

ఏం చెబుతున్నారంటే....

హైదరాబాద్‌: రోజురోజూకీ కరోనా కల్లోలం దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. దాని నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో శ్రమిస్తున్నాయి. అయితే వ్యక్తిగత శుభ్రత.. సామాజిక దూరం.. మాస్క్‌లు ధరించడం వంటి చిన్న చిన్న పనులతోనే మహమ్మారిని నివారించగలమని ఆయా ప్రభుత్వాలు, వైద్యులు, ఇతర అధికారులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ నివారణలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలుగు హీరోలు, ఇతర సెలబ్రిటీలు ఎన్నో వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాటలు, పేరడీలు, పలు ప్రత్యేక వీడియోలతో అవగాహన కల్పించారు. అయితే తాజాగా చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ‘స్టే హోమ్‌.. స్టే సేఫ్‌’ అనే నినాదాన్ని విభిన్నంగా చెబుతూ ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. చిరు షేర్‌ చేసిన ఈ ఫొటోలో ఆయనతో పాటు అల్లు అరవింద్‌, నాగబాబు, వరుణ్‌తేజ్‌, రామ్‌చరణ్‌, ఉపాసన, సుస్మితా కొణిదెల, అల్లు శిరీష్‌, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. ఈ ఫొటోషూట్‌ కోసం ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల నుంచే ప్లకార్డ్స్‌తో కనిపించారు.

సూపర్‌హీరో కావాల్సిన అవసరం లేదు..

మాస్క్‌ ధరించాలంటే సూపర్‌ హీరో కావాల్సిన అవసరం లేదంటున్నారు మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మహేశ్‌ తన కుమార్తె సితార, కుమారుడు గౌతమ్‌తో సరదాగా గడుపుతున్నారు. ఆ ఫొటోలను సైతం నమ్రత ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. తాజాగా నమ్రత.. మహేశ్‌ షూటింగ్స్‌కు సంబంధించిన రెండు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఆ ఫొటోల్లో మహేశ్‌, సితార మాస్క్‌లతో కనిపించారు. ‘మాస్క్‌ను ధరించాలంటే నువ్వు సూపర్‌హీరో కావాల్సిన అవసరం లేదు. కనీస జాగ్రత్తలు పాటించి మీ ప్రియమైనవారిని రక్షించుకోండి. మీ మాస్క్‌లను మీరే తయారు చేసుకోండి’ అని నమ్రత పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని