ఆ పాట అంతా రివర్స్‌లోనే: మాధవన్‌
close
Updated : 17/04/2020 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పాట అంతా రివర్స్‌లోనే: మాధవన్‌

తలుచుకుంటే చెమటలు పట్టేస్తున్నాయ్‌

చెన్నై: ‘అలలే.. చిట్టలలే’ అంటూ సాగే పాట షూట్‌ కోసం తాను రివర్స్‌లో హావభావాలను పలికించానని నటుడు మాధవన్‌ అన్నారు. ఒకప్పటి మెలోడి బాయ్‌ మాధవన్‌, షాలిని జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘సఖి’. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి క్లాసిక్‌ మూవీగా పేరు తెచ్చుకోవడమే కాకుండా మాధవన్‌కు ఎందరో అభిమానులను సొంతం చేసింది. ఏప్రిల్‌ 14తో ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలైన సందర్భంగా ఓ అభిమాని ట్విటర్‌ వేదికగా.. ‘అలలే.. చిట్టలలే’ అంటూ సాగే ఓ పాటను షేర్‌చేస్తూ..‘మాధవన్‌ ఈ సినిమాలో మీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నారు’ అని ట్వీట్‌ చేసింది.

తాజాగా మాధవన్‌ తన ట్విటర్‌ ఖాతా వేదికగా అభిమాని ట్వీట్‌పై స్పందించారు. ‘అలలే.. చిట్టలలే’ పాట చిత్రీకరణ సమయంలో తాను ఎంతగానో కష్టపడ్డానని తెలిపారు. ‘లిప్‌ సింక్‌ కోసమని ఈ పాటను రివర్స్‌లో అలపించాను. రివర్స్‌లో హావభావాలను పలికించాను. అవన్నీ గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చెమటలు పట్టేస్తున్నాయి. అందులోను ఇదే నా మొదటి సినిమా.’ అని మాధవన్‌ తెలిపారు. అయితే ఈ పాటలోని చాలా సన్నివేశాలను మణిరత్నం రివర్స్‌, స్లో వెర్షన్‌లో చిత్రీకరించారు. ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎందరో సినీ ప్రియులను అలరిస్తున్నాయి.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని