గౌతమ్‌తో ఆటాడుతూ మైమరచిపోయిన మహేశ్‌
close
Published : 17/04/2020 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గౌతమ్‌తో ఆటాడుతూ మైమరచిపోయిన మహేశ్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ తారలంతా ఇళ్లకే పరిమితమై ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నారు. ఇక అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుకు ఏ కాస్త విరామం దొరికినా ఆ సమయాన్నంతా కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తారని అందరికీ తెలిసిందే. పైగా ఇప్పుడు మహేశ్‌ టెన్షన్‌ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఆయన కొత్త చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా తన కూతురు సితార, కొడుకు గౌతమ్‌లతో కలిసి టైమ్‌ పాస్‌ చేస్తున్నారు.

తాజాగా తన కుమారుడు గౌతమ్‌తో కలిసి ఇంట్లో వర్చువల్‌గా టెన్నిస్‌ ఆడుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కొడుకుతో కలిసి పోటీగా ఆడుతూ  అందులో లీనమైపోయారు. షాట్స్‌ కొట్టినప్పుడు చిన్నపిల్లాడిలా ఎగురుతూ కనిపించారు. వెనుక నుంచి సితార సలహాలిస్తుంటే, మైమరచిపోయి గేమ్‌ ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. 

కేవలం కుటుంబ సభ్యులతో గడపడమే కాదు, లాక్‌డౌన్‌ వేళ అలుపెరగక విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పలు ట్వీట్లు చేస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని