నెటిజన్‌ చీప్‌ కామెంట్‌.. శ్రియ భర్త రిప్లై
close
Updated : 17/04/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెటిజన్‌ చీప్‌ కామెంట్‌.. శ్రియ భర్త రిప్లై

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో..

హైదరాబాద్‌: తన సతీమణి శ్రియపై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయమని ఆండ్రీ నెటిజన్లను కోరారు. శ్రియ తరచూ సోషల్‌మీడియా వేదికగా డ్యాన్స్‌ వీడియోలను పంచుకుంటూ ఉంటారు. అనేక సందర్భాల్లో అవి వైరల్‌ అయ్యాయి. తాజాగా శ్రియ, ఆండ్రీ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఫాలోవర్స్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ శ్రియ శరీరాన్ని ఉద్దేశించి కాస్త శృతిమించి మాట్లాడారు. నెటిజన్‌ కామెంట్‌ను శ్రియ పట్టించుకోకపోయినా.. ఆమె భర్త ఆండ్రీ మాత్రం దానిపై ఫన్నీగా స్పందించారు. ‘మీ మాటలకు నేను ఏకీభవిస్తున్నా. ఆమెపై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి.. ప్లీజ్‌’ అని రిప్లై ఇచ్చారు. భర్త ఆ మాట అనగానే పక్కనున్న శ్రియ ఆయన్ను నవ్వుతూ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

2018 మార్చిలో రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీని శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు స్పెయిన్‌లో ఉన్నారు. తన భర్త కరోనా లక్షణాలతో బాధపడ్డాడని, కొన్ని రోజుల క్రితం కోలుకున్నాడని ఇటీవల శ్రియ చెప్పారు. 2019లో వచ్చిన ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’లో ఆమె తెలుగు తెరపై కనిపించారు. దీని తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంతకం చేశారు. అదేవిధంగా తమిళంలో ‘నరగాసురన్‌’, ‘సండక్కరి’ చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో ప్రకాశ్‌రాజ్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘తడ్కా’ చిత్రంలోనూ శ్రియ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని