‘ఫైట్‌ చేసిన మనం డ్యాన్స్‌ చేయాలి’
close
Published : 18/04/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఫైట్‌ చేసిన మనం డ్యాన్స్‌ చేయాలి’

టైగర్‌ను ఉద్దేశిస్తూ సుధీర్‌బాబు ట్వీట్‌

హైదరాబాద్‌: ‘బాఘి’ సినిమాతో బాలీవుడ్‌లోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి ప్రశంసలు అందుకున్న టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు. ఈ సినిమాలో కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌తో ఫైట్‌ చేసిన సుధీర్‌ ఏదో ఒకరోజు ఆయనతో కలసి డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నారు. ఇటీవల సుధీర్‌బాబు.. ఇప్పటివరకూ తాను కథానాయకుడిగా నటించిన పలు సినిమాల్లోని డ్యాన్స్‌ మూవ్స్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘నేను మనస్ఫూర్తిగా డ్యాన్స్‌ చేయలేదని నాకు తెలుసు. కానీ ఇప్పటివరకూ నేను నటించిన పలు సినిమాల్లో నాకెంతో ఇష్టమైన డ్యాన్స్‌ మూవ్స్‌ ఇవి. వీటిలో మీకు ఏ డ్యాన్స్‌ మూవ్‌ ఎక్కువగా నచ్చిందో నాకు తెలియజేయగలరు.’ అని సుధీర్‌ బాబు ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా సుధీర్‌బాబు పెట్టిన ట్వీట్‌పై బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ తాజాగా స్పందించారు. సుధీర్‌ డ్యాన్స్‌కు ఫిదా అయిన టైగర్‌.. ‘వావ్‌ బ్రదర్‌!! నెక్ట్స్‌ లెవల్‌’ అని రిప్లై ఇచ్చారు. అయితే టైగర్‌ పెట్టిన ట్వీట్‌పై సుధీర్‌ బాబు సైతం తనదైన శైలిలో స్పందించారు. ‘థ్యాంక్యూ టైగర్‌. ఓ సినిమా కోసం ఇద్దరం ఫైట్‌ చేసుకున్నాం. అలాగే మనం కలిసి ఏదో ఒకరోజు తప్పకుండా డ్యాన్స్‌ చేస్తామని భావిస్తున్నాను’ అని సుధీర్‌ బాబు అన్నారు.

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని