తమ్ముళ్లతో మీటింగ్‌.. మిస్‌ అవుతున్నా: చిరు
close
Published : 19/04/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమ్ముళ్లతో మీటింగ్‌.. మిస్‌ అవుతున్నా: చిరు

అపురూప చిత్రాన్ని షేర్‌ చేసిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: తమ్ముళ్లు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌తోపాటు సోదరీమణులను కలవడాన్ని తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇటీవల సోషల్‌మీడియాలోకి అడుగుపెట్టిన ఆయన కరోనావైరస్‌ గురించి ప్రజలకు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తూ తరచూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా తన కుటుంబసభ్యులకు సంబంధించిన చిత్రాలను సైతం సందర్భానుసారంగా అభిమానులతో పంచుకుంటున్నారు.

లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం తన తల్లి అంజనాదేవి, తమ్ముళ్లు పవన్‌కల్యాణ్‌, నాగబాబు, సోదరీమణులు మాధవి, విజయ దుర్గాలతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో తీసుకున్న ఓ ఫొటోను ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం నాడు ఇలా. ప్రియమైన వారిని కలవడం ఎంతగానో మిస్‌ అవుతున్నాను. మీలో చాలామందికి ఇలాంటి భావనే ఉందని నాకు తెలుసు. మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుందని నమ్ముతున్నాను. అమ్మ,నేను-చెల్లెళ్లు, తమ్ముళ్లు’ అని చిరంజీవి పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని