‘బద్రి’ వల్ల రెండు గొప్ప బహుమతులు పొందాను
close
Published : 20/04/2020 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బద్రి’ వల్ల రెండు గొప్ప బహుమతులు పొందాను

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు‌ పవన్‌కల్యాణ్‌తో దిగిన పలు ఫొటోలను నటి రేణు దేశాయ్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పవన్‌కల్యాణ్‌, రేణు దేశాయ్‌ జంటగా నటించిన చిత్రం ‘బద్రి’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేణు‌.. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో పవన్‌తో దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘‘బద్రి’ సినిమా షూటింగ్‌ విదేశాల్లో జరిగింది. రెండు పాటల చిత్రీకరణ కోసం ఓ లొకేషన్‌కు వెళ్లడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది. షాట్స్‌ మధ్యలో అక్కడ కూర్చోడానికి కనీసం కుర్చీలు కూడా మాకు లేవు. ఆ సమయంలో నేను స్కర్ట్‌ ధరించడం వల్ల రాళ్లపై కూర్చొలేకపోయాను. ‘ఒక అమ్మాయి మీ ముందు నిలబడినప్పుడు మీరు కూర్చోవడం తప్పు’ అని నేను పవన్‌కల్యాణ్‌ గారితో అప్పుడు జోక్‌ చేశాను. మేము షూటింగ్‌ చేసిన ఈ లోకేషన్‌లో విపరీతమైన గాలి వీస్తుండేది. గాలి వల్ల డ్యాన్స్‌ చేయడానికి, ఆఖరికి నిలబడడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను’’

‘‘ఈ పై ఫొటో ఆ రోజు పేకప్‌ చెప్పిన తర్వాత తీసింది. ‘ఏ చికితా’ పాటలో కల్యాణ్‌గారు పాల్గొన్నారు. ఆ తర్వాత నాపై విషాద గీతం ‘వరమంటే’ అనే పాటను చిత్రీకరించారు. ఈ లోకేషన్‌కు వెళ్లడానికి చాలా దూరం నడవాల్సి వచ్చింది. దాంతో బాగా అలసిపోయాం. అయినా సరదాగా అనిపించింది. నీరసం, ఆకలి వల్ల మేమిద్దరం మా ప్రపంచాలను కోల్పోయినట్లు కూర్చొన్నాం’’ అని రేణూ పేర్కొన్నారు.

‘‘నేటికి ‘బద్రి’ విడుదలై 20ఏళ్లు పూర్తి చేసుకుంది. పూరి జగన్నాథ్‌గారు నన్ను నమ్మి కనీసం ఆడిషన్‌ కూడా చేయకుండా సినిమాలోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు. ‘బద్రి’ ఎప్పటికీ నాకు స్పెషల్‌. సినిమా ప్రపంచం అంటే తెలియని 18ఏళ్ల అమ్మాయి  ఎలాంటి ఆందోళన లేకుండా భద్రతతో కూడిని వాతావరణంలో పని కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ‘బద్రి’ కారణంగానే నా జీవితంలో రెండు వెల కట్టలేని బహుమతులు వచ్చాయి. అవి నా చిన్నారి దేవతలు అఖీరా, ఆద్య. ఈ చిత్రం నా హృదయానికి ఎంతో దగ్గరైనది’’ అని ఇన్‌స్టా వేదికగా చెప్పుకొచ్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని