హైదరాబాద్‌ టు చెన్నై.. అజిత్‌ బైక్‌ రైడింగ్‌
close
Updated : 21/04/2020 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ టు చెన్నై.. అజిత్‌ బైక్‌ రైడింగ్‌

650 కి.మీ ఒంటరిగా..

చెన్నై: తమిళ స్టార్‌ అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన అనేక బైక్‌ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బైక్‌ రైడింగ్‌పై ఉన్న మక్కువతో చాలా రోజుల క్రితం అజిత్‌ హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణం చేశారట. దాదాపు 650 కిలో మీటర్లు రోడ్డుపై ప్రయాణించి.. కేవలం ఆహారం, పెట్రోల్‌ కోసం మాత్రం దుకాణాల వల్ల ఆగారని ‘వాలిమై’ చిత్ర బృందం తాజాగా తెలిపింది.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ‘వాలిమై’ సినిమా షూటింగ్‌ జరిగింది. సినిమాలోని బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశాన్ని తెరకెక్కించారు. అజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా నటిస్తున్న నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేకంగా బైక్‌ను డిజైన్‌ చేయించారు. ఆ బైక్ అజిత్‌కు ఎంతో నచ్చిందట. సినిమా షెడ్యూల్‌ పూర్తి చేసుకుని అందరూ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు తన విమానం టికెట్టును రద్దు చేయమని అజిత్‌ అసిస్టెంట్‌కు చెప్పారట. బైక్‌పై ఒంటరిగా చెన్నైకి వస్తానని అన్నారు. దీంతో అసిస్టెంట్‌ విమానంలో చెన్నైకి రాగా.. అజిత్‌ 650 కిలో మీటర్లు బైక్‌పై ప్రయాణించి చెన్నై చేరుకున్నారని చిత్ర బృందం పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం బయటికి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అజిత్‌ ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

‘వాలిమై’ సినిమాకు హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాత. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ కథానాయికగా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రం షూటింగ్‌ను వాయిదా వేశారు. నవంబరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని