కావాలంటే.. అప్పు తీసుకుంటా: ప్రకాశ్‌రాజ్‌
close
Published : 20/04/2020 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కావాలంటే.. అప్పు తీసుకుంటా: ప్రకాశ్‌రాజ్‌

తిరిగి సంపాదించుకోగలను

హైదరాబాద్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తనచుట్టూ ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఆకలి తీర్చారు. ఉపాధిలేక బాధపడుతున్న వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు తీసిన ఫొటోలను ఆయన ఇప్పటికే పంచుకున్నారు. కాగా సోమవారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినాసరే లోన్‌ తీసుకునైనా పేదలకు సాయం చేయడం కొనసాగిస్తా. కావాలంటే నేను మళ్లీ సంపాదించుకోగలను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వంతో వ్యవహరించాలి. మనమంతా కలిసి ఐకమత్యంతో పోరాడుదాం. అవసరాల్లో ఉన్న వారికి చేయూతగా ఉందాం. ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌ ముందడుగు’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

పేదల సహాయార్థం తెగువతో మాట్లాడిన ప్రకాశ్‌రాజ్‌ను చాలా మంది నెటిజన్లు ప్రశంసించారు. ‘గొప్ప వ్యక్తి, మీరు అందరికీ స్ఫూర్తి, లవ్‌ యూ సర్‌, మీకు నా సెల్యూట్‌, గొప్ప సమాజసేవ..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు. ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆయన 1000 కుటుంబాలకుపైగా సాయం చేస్తున్నారు. అంతేకాదు అనేక మందికి తన ఫాంహౌస్‌లో ఆశ్రయం ఇచ్చారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు తోచిన సాయం చేయాలని కోరారు. తన ఇల్లు, ఫాంహౌస్‌, నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ముందుగానే మూడు నెలల జీతం ఇచ్చేశానని ఇటీవల చెప్పారు. ప్రకాశ్‌రాజ్‌ ప్రస్తుతం ‘పుష్ప’లో నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’లో, రజనీకాంత్‌ చిత్రంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని