పవన్‌ రోజూ 600 కి.మీ ప్రయాణించేవారు!
close
Published : 21/04/2020 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ రోజూ 600 కి.మీ ప్రయాణించేవారు!

‘వకీల్‌సాబ్‌’ దర్శకుడు

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న సినిమా ‘వకీల్‌ సాబ్‌’. రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సంతకం చేసిన సినిమా ఇది. హిందీ హిట్‌ ‘పింక్‌’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. అంజలి, నివేదా థామస్‌, అనన్యా నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, నరేష్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని అతిథి పాత్రలో ఇలియానా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు.

కాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ జరుగుతున్న సమయంలో పవన్‌ రోజూ 600 కిలోమీటర్లు ప్రయాణించేవారని దర్శకుడు వేణు శ్రీరామ్‌ చెప్పారు. సినిమా షూటింగ్‌కు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు పవన్‌ చాలా కష్టపడ్డారని తెలిపారు. దాదాపు 22 రోజులపాటు విజయవాడ టు హైదరాబాద్‌, హైదరాబాద్‌ టు విజయవాడ ప్రయాణించారని, ప్రతి రోజూ 600 కిలోమీటర్లు ట్రావెల్‌ చేసేవారని పేర్కొన్నారు. ఒక్క రోజు కూడా షూట్‌ను మిస్‌ చేయలేదంటూ ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు. సినిమాకు సంబంధించిన ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయిందని తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత మిగిలిన భాగం షూటింగ్‌ కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఈ సినిమా తర్వాత పవన్‌-హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని