సతీమణి కోసం సుకుమార్‌ ఏం చేశారంటే?
close
Published : 22/04/2020 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సతీమణి కోసం సుకుమార్‌ ఏం చేశారంటే?

నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వీడియో

హైదరాబాద్‌: BeTheREALMAN ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమై ఇంటిల్లిపాదికీ సేవలు చేస్తూ మహిళలు ఎంతో కష్టపడుతున్నారు. నిర్విరామంగా సేవలు చేస్తున్న అమ్మ, భార్య, సోదరి, కుమార్తెకి పనుల్లో ప్రతిఒక్కరూ తమ వంతు సాయం చేయాలని పలువురు సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్‌ తన సతీమణికి పనుల్లో సాయం చేస్తూ ఉన్న ఓ వీడియోను రూపొందించి.. రాజమౌళికి ఛాలెంజ్‌ విసిరారు. అలా రాజమౌళి నుంచి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. తాజాగా డైరెక్టర్‌ సుకుమార్‌  #BeTheREALMAN ఛాలెంజ్‌ను స్వీకరించారు. తన సతీమణి తబితకు ఇంటిని శుభ్రం చేసే పనుల్లో సాయం చేయడమే కాకుండా.. గిన్నెలను కూడా కడిగారు. ఈ వీడియోను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసిన సుకుమార్‌.. దేవిశ్రీ ప్రసాద్‌, వంశీపైడిపల్లి, సురేందర్‌ రెడ్డి, శివ కొరటాల, దిల్‌రాజుకు BeTheREALMAN ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు.

‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య2’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని