చిన్నోడికి పెద్దోడు.. ప్రభాస్‌కు శోభు ఛాలెంజ్‌
close
Updated : 23/04/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నోడికి పెద్దోడు.. ప్రభాస్‌కు శోభు ఛాలెంజ్‌

వీడియో షేర్‌ చేసిన ‘వెంకీమామ’

హైదరాబాద్‌: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో పెద్దోడు, చిన్నోడుగా మెప్పించారు టాలీవుడ్‌ కథానాయకులు వెంకటేశ్‌, మహేశ్‌బాబు. తాజాగా మహేశ్‌బాబుకు వెంకటేశ్‌ ఛాలెంజ్‌ విసిరారు. ఇంట్లోని మహిళలకు పనుల్లో సాయం చేసి వీడియో పోస్ట్‌ చేయమని ఆయన కోరారు. తారక్‌ నామినేట్‌ చేయడంతో #BeTheRealMan ఛాలెంజ్‌ను స్వీకరించిన వెంకటేశ్‌ తాజాగా ఇంట్లో పనులు చేస్తున్న ఓ వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో ఆయన ఇంటిని శుభ్రం చేయడంతోపాటు గార్డెనింగ్‌, వంట చేస్తూ కనిపించారు. ఈ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘తారక్‌ ఇదిగో నా వీడియో. ఇంటి పనుల్లో మన కుటుంబానికి సాయం చేసి #BeTheRealMan అనిపించుకోండి. మన చిన్నోడు మహేశ్‌బాబు, నా కోబ్రో వరుణ్‌తేజ్‌, అనిల్ ‌రావిపూడిని ఈ ఛాలెంజ్‌ కోసం నేను నామినేట్‌ చేస్తున్నాను’ అని వెంకీ పేర్కొన్నారు. వెంకటేశ్‌ విసిరిన ఛాలెంజ్‌ను అనిల్‌రావిపూడి స్వీకరించారు.

వెంకటేశ్‌తో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా #BeTheRealMan ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. దర్శకుడు రాజమౌళి నుంచి సవాల్‌ను స్వీకరించిన ఆయన అల్లు అర్జున్‌, అడవిశేష్‌, ప్రభాస్‌లకు సవాల్‌ విసిరారు.

ఇవీ చదవండి

వావ్‌.. అనిపిస్తున్న చిరు దోశెలు..

కత్తి పట్టిన చేత్తోనే.. చీపురు పట్టిన ఎన్టీఆర్‌

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని