కమల్‌ కోసం తరలివచ్చిన తారాలోకం
close
Published : 23/04/2020 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమల్‌ కోసం తరలివచ్చిన తారాలోకం

పాటతో మెప్పించిన లోకనాయకుడు

చెన్నై: దక్షిణాది అగ్రకథానాయకుడు, లోకనాయకుడు కమల్‌హాసన్‌ పాడిన పాట కోసం దక్షిణాదికి చెందిన పలువురు తారలతోపాటు గాయనీగాయకులు తరలివచ్చారు. కరోనా  మహమ్మారి నివారణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులను ప్రశంసిస్తూ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాటలను అలపించిన విషయం తెలిసిందే. తాజాగా కమల్‌హాసన్‌ దేశంలో ఉన్న పరిస్థితులను గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ.. పోలీసులకు, వైద్యులకు వందనం చేస్తూ ఓ పాటను రాశారు. అంతేకాకుండా ఆయనే స్వయంగా ఆ పాటను అలపించారు. జిబ్రాన్‌ సంగీతం అందించిన ఈ పాటను కమల్‌తోపాటు ఆయన కుమార్తె శ్రుతిహాసన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, యువన్ శంకర్‌ రాజా, అనిరుధ్‌, బొంబాయి జయశ్రీ, శంకర్‌ మహదేవ్‌, సిద్‌ శ్రీరామ్‌, సిద్దార్థ్‌, ఆండ్రియా తదితరులు అలపించారు. దీనికి సంబంధించిన వీడియోను కమల్‌తోపాటు ఇతర బృందం తమ సోషల్‌మీడియా ఖాతాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఈ పాటను వీక్షించే వారి సంఖ్య లక్షల్లో ఉంది.

ఇదీ చదవండి

కరోనా కట్టడికి సినీపరిశ్రమ కృషి

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని